Cold Wave | వణికిస్తున్న చలి.. మరో 36 గంటలు జాగ్రత్త

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cold Wave | రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. నాలుగు రోజులుగా శీతల గాలులు తీవ్రంగా వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ (Telangana)లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. డిసెంబర్​ చివరి వారం నుంచి జనవరి 5 వరకు చలి ప్రభావం తక్కువగా ఉంది. పొగమంచు మాత్రం కురిసింది. అయితే నాలుగు రోజులుగా చలి మళ్లీ పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు (Temperatures) రికార్డు స్థాయిలో పడిపోయాయి. పలు ప్రాంతాల్లో సింగిల్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cold Wave | రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. నాలుగు రోజులుగా శీతల గాలులు తీవ్రంగా వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణ (Telangana)లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. డిసెంబర్​ చివరి వారం నుంచి జనవరి 5 వరకు చలి ప్రభావం తక్కువగా ఉంది. పొగమంచు మాత్రం కురిసింది. అయితే నాలుగు రోజులుగా చలి మళ్లీ పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు (Temperatures) రికార్డు స్థాయిలో పడిపోయాయి. పలు ప్రాంతాల్లో సింగిల్​ డిజిట్​ టెంపరేచర్​ నమోదు అవుతోంది. ఉదయం 10 గంటల వరకు చలి పెడుతోంది. సాయంత్రం 5 గంటలు దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితి. మధ్యాహ్నం సైతం చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే మరో 36 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తర్వాత చలి కాస్తా తగ్గి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్నారు.

Cold Wave | కనిష్ట ఉష్ణోగ్రతలు

శుక్రవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో సింగిల్​ డిజిట్​ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డి జిల్లా  (Sangareddy District) కోహిర్​లో 6.6 డిగ్రీలు, ఆసిఫాబాద్​ జిల్లా తిర్యానిలో 7.1, రంగారెడ్డి ల్లా మొయినాబాద్​లో 7.2, కామారెడ్డి జిల్లా జుక్కల్​లో 8.1, మర్పల్లే(వికారాబాద్​) 8.2, భీమ్​పూర్​ (ఆదిలాబాద్​) 8.3, గంభీరావుపేట (సిరిసిల్ల) 9.1, వెల్దుర్తి (మెదక్​) 9.4, సాలూరా (నిజామాబాద్​) 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.