అక్షరటుడే, వెబ్డెస్క్: Kite Festival | హైదరాబాద్ నగరంలో కైట్ ఫెస్టివల్ (Kite Festival) ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
నగరంలోని సికింద్రాబాద్ (Secunderabad) పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. అంతేగాకుండా హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద సైతం కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు చెరువులను గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) పరిశీలించారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత పతంగుల పండుగను పెద్దఎత్తున నిర్వహించాలని ప్రభుత్యం నిర్ణయించిన నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Kite Festival | సుందరీకరణ పనులు
కూకట్పల్లి నల్లచెరువుతో పాటు మాదాపూర్లోని తమ్మిడికుంట, పాతబస్తీలోని బమ్-రుక్న్ – ఉద్ – దౌలా చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. దీంతో ఆ చెరువులను కమిషనర్ పరిశీలించారు. మూడు నాలుగు రోజుల్లో సుందరీకరణ పనులు పూర్తి చేసి వేడుకలకు వేదికలు సిద్ధం చేయాలన్నారు. లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. చెరువుల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని అధికారులను ఆదేశించారు. చెరువుల పరిసరాలు ప్రజలకు ఆకర్షణీయంగా ఉండేలా అభివృద్ధి చేయాలని, నడక మార్గాలు, లైటింగ్, శుభ్రత పనులు, భద్రతా ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు.