అక్షరటుడే, బోధన్ : Collector Nizamabad | మహిళా సాధికారత కోసం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు.
పట్టణంలోని రోటరీ భవన్ (Rotary Bhavan) కాన్ఫరెన్స్ హాల్లో మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని 3,703 సంఘాలకు వడ్డీలేని రుణాల రూపేణ ప్రభుత్వం రూ.4.28 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమ చేసిందని ఆయన తెలిపారు.
Collector Nizamabad | నల్గొండ తర్వాత..
నల్గొండ తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాకు (Nizamabad District) వడ్డీలేని రుణాల కింద ప్రభుత్వం రూ.23.26 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రణాళికతో ఆయా కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
Collector Nizamabad | ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రతి మహిళా సభ్యురాలికి అవగాహన ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. అప్పుడే అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ లక్ష్యం దిశగా ముందుకు సాగుతారని సూచించారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణాలు అందించడమే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, యూనిఫాం స్టిచింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు వంటి పథకాలు మంజూరు చేస్తోందన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రూ. 67కోట్ల రుణాలు అందజేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub Collector Vikas Mahato), తహశీల్దార్ విఠల్, ఐకేపీ డీపీఎం రాచయ్య తదితరులు పాల్గొన్నారు.
