అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (Donald Trump) అనుసరిస్తున్న విధానాలతో మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. దీనికితోడు డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజురోజుకూ తగ్గుతూ రావడం, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, మూడు నెలలుగా రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాలకు పాల్పడుతుండడంతో మార్కెట్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉంది.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 158 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి కోలుకుని 384 పాయింట్లు పెరిగి కాసేపు లాభాల బాటలో సాగింది. అయితే ఇన్వెస్టర్లు భయాలతో అమ్మకాలకు పాల్పడడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 1,004 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ (Nifty) 36 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 100 పాయింట్లు ఎగబాకింది. గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో ఒక్కసారిగా పతనమై 317 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 604 పాయింట్ల నష్టంతో 83,576 వద్ద, నిఫ్టీ 193 పాయింట్ల నష్టంతో 25,683 వద్ద స్థిరపడ్డాయి.
వారంలో 2 వేల పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..
ఈ వారంలో సెన్సెక్స్ 2,001 పాయింట్లు, నిఫ్టీ 596 పాయింట్లు నష్టపోయాయి. గడిచిన మూడు నెలల్లో ఇదే అత్యంత బలహీనమైన వారంగా నిలిచింది.
స్మాల్ క్యాప్‌లో భారీగా అమ్మకాలు..
బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్ 2.22 శాతం, సర్వీసెస్ 1.84 శాతం, యుటిలిటీ 1.82 శాతం, పవర్ 1.79 శాతం, క్యాపిటల్ మార్కెట్ 1.47 శాతం, టెలికాం 1.41 శాతం, ఇన్‌ఫ్రా 1.25 శాతం, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.09 శాతం, ఆటో 0.53 శాతం నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్ 0.52 శాతం, ఐటీ ఇండెక్స్ 0.21 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.16 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.09 శాతం పెరిగాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.74 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.90 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.78 శాతం ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 1,065 కంపెనీలు లాభపడగా 3,105 స్టాక్స్ నష్టపోయాయి. 176 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 76 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 329 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభపడగా.. 21 కంపెనీలు నష్టపోయాయి. ఆసియా పెయింట్ 1.36 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.86 శాతం, బీఈఎల్ 0.77 శాతం, రిలయన్స్ 0.34 శాతం, ఎటర్నల్ 0.32 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఎన్టీపీసీ 2.34 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.22 శాతం, అదాని పోర్ట్స్ 1.98 శాతం, ఎయిర్‌టెల్ 1.89 శాతం, సన్‌ఫార్మా 1.40 శాతం నష్టపోయాయి.