అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | అమెరికా అనుసరిస్తున్న విధానాలు మన ఆర్థిక వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ (Trump Tariffs) బెదిరింపులకు అడ్డుకట్ట పడకపోవడం, యూఎస్‌తో ట్రేడ్ ఎటూ తేలకపోవడం, రూపాయి విలువలో బలహీనత కొనసాగుతుండడం, ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) అతలాకుతలమవుతోంది.
వరుసగా ఆరో సెషన్‌లోనూ నష్టాలతో కొనసాగుతోంది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 182 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 574 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ (Nifty) 14 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 31 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో 171 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 10.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 415 పాయింట్ల నష్టంతో 83,160 వద్ద, నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 25,564 వద్ద ఉన్నాయి.
ఆటో, టెలికాం రంగాల్లో అమ్మకాలు..
ఆటో, రియాలిటీ, టెలికాం రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మెటల్ సెక్టార్ మాత్రమే ఓ మోస్తరు లాభాలతో కొనసాగుతోంది. బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్ 0.87 శాతం, కమోడిటీ 0.16 శాతం, క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ 0.16 శాతం లాభాలతో ఉండగా.. ఆటో 1.04 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.99 శాతం, టెలికాం 0.97 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.83 శాతం, పవర్ 0.75 శాతం, సర్వీసెస్ 0.75 శాతం, యుటిలిటీ 0.48 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.11 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.46 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో ఉండగా.. 23 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా స్టీల్ 1.04 శాతం, ట్రెంట్ 0.99 శాతం, ఎన్టీపీసీ 0.68 శాతం, ఆసియా పెయింట్ 0.40 శాతం, ఐటీసీ 0.34 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 1.46 శాతం, ఎటర్నల్ 1.42 శాతం, ఎంఅండ్‌ఎం 1.27 శాతం, ఎల్‌టీ 1.24 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.24 శాతం నష్టాలతో ఉన్నాయి.