HomeతెలంగాణI Bomma Ravi | ఐబొమ్మ రవిని అలా పట్టుకున్నాం.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

I Bomma Ravi | ఐబొమ్మ రవిని అలా పట్టుకున్నాం.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

ఐబొమ్మ వెబ్​సైట్​ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అతడి స్నేహితుడు నిఖిల్​ ద్వారా ట్రాప్​ చేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ అడిషనల్ సీపీ శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రవి అరెస్ట్ వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : I Bomma Ravi | ఐబొమ్మ వెబ్​సైట్​ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. అతడిని ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకొని కీలక విషయాలు రాబట్టారు. ఇమ్మడి రవిని ఎలా అరెస్ట్​ చేశారో తాజాగా పోలీసులు వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్ (Hyderabad) అడిషనల్ సీపీ శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రవి అరెస్ట్​, ఇతర వివరాలు మీడియాకు తెలిపారు. రవి స్నేహితుడు నిఖిల్​ ఐబొమ్మ, బప్పమ్​ టీవీ పోస్టర్లను తయారు చేసేవాడు. దీంతో నిఖిల్​ ద్వారా పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. ఆన్​లైన్​ గేమింగ్​, బెట్టింగ్​ యాప్​ల ద్వారా రవికి భారీగా డబ్బులు వచ్చినట్లు తెలిపారు. ఈ డబ్బును రవి యాడ్​ బుల్  అనే కంపెనీకి మళ్లించినట్లు చెప్పారు.

I Bomma Ravi | ఎన్జీవోలుగా రిజిస్టర్​

ఐబొమ్మ వెబ్​సైట్​ వెనుక మొత్తం రవి ఒక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఐబొమ్మను క్రియేట్ చేశాడన్నారు. ఐ బొమ్మ, బప్పం (Bappam) డొమైన్​లను రవి ఎన్జీవోల పేరిట రిజిస్టర్​ చేసుకున్నట్లు చెప్పారు. అతడికి హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. కాగా రవి భార్య చెబితేనే పోలీసులు పట్టుకున్నారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో తామే రవిని పట్టుకున్నట్లు పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

I Bomma Ravi | మళ్లీ కస్టడీకి కోరిన పోలీసులు

ఐ బొమ్మ రవిని ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి 7 రోజుల కస్టడీకి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు. నాంపల్లి కోర్టు (Nampalli Court)లో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం బుధవారం ఆదేశాలు ఇవ్వనుంది. రవి పోలీసుల విచారణకు సహకరించడం లేదని, మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడుతమని పిటిషన్​లో పేర్కొన్నారు.