Nimisha Priya | ఆ వార్తలు అవాస్తవం.. నిమిష ప్రియ మరణశిక్ష రద్దు కాలేదు.. కేంద్ర ప్రభుత్వ వర్గాల క్లారిటీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nimisha Priya | యెమెన్ (Yemen)​లో భారత్​కు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యెమెన్​ దేశస్తుడి హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష పడింది. జులై 16నే ఆమెకు ఉరిశిక్ష విధించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్చలతో ఉరిశిక్షను యెమెన్​ ప్రభుత్వం వాయిదా వేసింది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nimisha Priya | యెమెన్ (Yemen)​లో భారత్​కు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యెమెన్​ దేశస్తుడి హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష పడింది. జులై 16నే ఆమెకు ఉరిశిక్ష విధించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్చలతో ఉరిశిక్షను యెమెన్​ ప్రభుత్వం వాయిదా వేసింది.

నిమిష ప్రియ మరణ శిక్ష రద్దు చేశారంటూ సోమవారం రాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ, కాంతపురం AP అబుబక్కర్ ముస్లయ్యర్ కార్యాలయం ప్రకటించింది. అయితే విదేశాంగ శాఖ తాజాగా దీనిపై స్పందించింది. యెమెన్​ ప్రభుత్వం నుంచి తమకు ఉరిశిక్ష రద్దుకు సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పింది. ఆ వార్తలు అన్ని అవాస్తవం అని పేర్కొంది.

Nimisha Priya | మళ్లీ మొదటికి..

యెమెన్​ దేశస్తుడి హత్య కేసులో నిమిష ప్రియకు ఉరి శిక్ష పడింది. అక్కడ వ్యాపార భాగస్వామిగా ఉన్న తలాల్ అబ్దో మహదీని నిమిష హత్య చేసింది. అనంతరం పారిపోతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 2024లో అక్క‌డి కోర్టు మరణశిక్ష విధించబడింది. ఈ నెల 16న ఉరి తీసేందుకు నిర్ణ‌యించ‌గా, భార‌త దౌత్యంతో ఆగిపోయింది. బ్లడ్​మనీ (Blood Money) కోసం సమయం కావాలని కోరడంతో యెమెన్​ ప్రభుత్వం ఉరిశిక్షను వాయిదా వేసింది. ఈ క్రమంలోనే మరణ శిక్ష రద్దయినట్లు వార్తలు వచ్చాయి. అయితే విదేశాంగ శాఖ మాత్రం మరణ శిక్ష రద్దు కాలేదని తెలిపింది. కాగా మృతుడి కుటుంబ సభ్యులు బ్లడ్​మనీకి అంగీకరించమని తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసు ఎటువైపు వెళ్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.