అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mouni Roy | ‘నాగిని’ సీరియల్ (Naagini Serial) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సూపర్‌హిట్ షో హిందీలో టెలికాస్ట్ కాగా.. ఇందులో నటించిన హీరోలు, హీరోయిన్‌ల కన్నా విలన్ పాత్ర పోషించిన మౌనీ రాయ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
టీవీ ద్వారా వచ్చిన ఫేమ్‌తోనే ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే సినీరంగంలో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని మౌనీ (Mouni Roy) తాజాగా బయటపెట్టింది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మౌనీ రాయ్, తన కష్టసుఖాల ప్రయాణం గురించి చెబుతూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
Mouni Roy | చాలా భయమేసింది..
నేను 21 ఏళ్ల వయసులో నుంచే సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేదాన్ని. ఒక రోజు ఓ దర్శకుడు రోల్ ఇస్తానంటూ పిలిచాడు. కథ చెబుతూ ఒక్కసారిగా నన్ను ముద్దు పెట్టుకున్నాడు. నాకు చాలా భయమేసింది. ఆ ఘటన చాలా కాలం నన్ను వేధించింది అని చెప్పింది. ఆ తరువాత కూడా ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నాను. అలాంటి దర్శకులు చాలామందినే చూశాను. కానీ వెనక్కి తగ్గలేదు. నా ప్రతిభ, కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లాను.. అందుకే నేడు ఈ స్థాయికి చేరుకున్నానని మౌనీ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో (Social Media) పెద్ద చర్చగా మారాయి.
మౌనీ రాయ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో ఆమె కనిపించనుంది. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. 2026 సమ్మర్‌లో ‘విశ్వంభర’ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. మౌనీ స్పెషల్ నంబర్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా హిట్ కావడంతో పాటు సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తే రానున్న రోజుల్లో మౌనీ రాయ్‌కి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.
