అక్షరటుడే, హైదరాబాద్: Telangana traditional dishes | తెలంగాణకు Telangana ప్రత్యేకమైన సంప్రదాయ తినుబండారాలైన సర్వపిండి sarva pindi, సకినాల sakinalu కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి గ్రామీణాభివృద్ధి శాఖ Rural Development Department బిగ్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది.
ఈ రెండు సంప్రదాయ వంటకాలను గ్లోబల్ మార్కెట్లో నిలబెట్టేందుకు మేడ్చల్ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా తయారు చేస్తున్న ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్‌ను అందించేందుకు అధికారులు కృషి ప్రారంభించారు.
మేడ్చల్ జిల్లాలో మొత్తం 3,585 స్వయం సహాయక సంఘాలు ఉండగా, వీటిలో 38,526 మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల్లో సుమారు 60 శాతం సంఘాలు వివిధ తినుబండారాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి.
Telangana traditional dishes | అంతర్జాతీయ వేదికపై..
బెల్లంతో తయారయ్యే లడ్డూలు, బూందీ, సర్వపిండి, సకినాలు, కజ్జికాయలు, గవ్వలు వంటి సాంప్రదాయ స్వీట్లు, అలాగే రాగులు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలతో తయారైన మిక్చర్, కారప్పూస, బూందీ వంటి ఉత్పత్తులకు కూడా మంచి డిమాండ్ ఉంది.
ఉత్పత్తుల నాణ్యత పెంపునకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ స్థానిక వంటకాలు అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలంటే శుచిగా తయారీ, ఆకర్షణీయ ప్యాకింగ్, నాణ్యత ధ్రువపత్రాలు అత్యవసరమని భావించిన అధికారులు మహిళలకు ప్రత్యేక శిక్షణ అందించారు.
దీనిలో భాగంగా SHG మహిళలను కేరళలోని Kerala కుదుంబశ్రీ,హైదరాబాద్‌లోని నిథమ్ సంస్థ వంటి విజయవంతమైన మోడల్స్ వద్దకు తీసుకువెళ్లి, ఆధునిక యంత్రాలతో వేగంగా, హైజీనిక్‌గా పిండివంటలు, పచ్చళ్లు, పొడులు ఎలా తయారుచేయాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు.
ప్రస్తుతం మహిళలు తమ ఉత్పత్తులపై FSSAI నాణ్యత ధ్రువపత్రాలను పొందడం ప్రారంభించారు.అమ్మకాలు పెరగాలంటే మార్కెటింగ్ లో నైపుణ్యం అవసరం. ఈ దిశగా BITS హైదరాబాద్ ప్రొఫెసర్లతో ప్రత్యేక తరగతులు, బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు,రుణ సదుపాయాలపై అవగాహన, డిమాండ్–సప్లై, లాభనష్టాలపై శిక్షణ అందించారు.
తదుపరి దశలో SHG తయారీ ఉత్పత్తులను Amazon, Flipkart వంటి ఈ–కామర్స్ దిగ్గజాల ద్వారా విక్రయించేందుకు ఒప్పందాల రూపకల్పన జరుగుతోంది. అధికారుల ప్రణాళికలు సక్రమంగా అమలైతే, మన తెలంగాణ సర్వపిండి… మన సకినాలు… ప్రపంచ మార్కెట్లలో చోటు దక్కించుకునే అవకాశం చాలా దగ్గరలోనే ఉంది.
