అక్షరటుడే, బాన్సువాడ: Telangana Brahmotsavam | బీర్కూర్ మండలం (Birkur Mandal) తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దేవనాధ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో వహించారు. కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సతీమణి పుష్పతో కలిసి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవానికి ముందుగా నిర్వహించిన హోమ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస రెడ్డి (Pocharam Srinivas) సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ ఉత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా పోచారం కుటుంబ సభ్యులు పోచారం శంభు రెడ్డి, ప్రేమ దంపతులు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, సోని రెడ్డి దంపతులు, శ్రీ పోచారం సురేందర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
