అక్షరటుడే, హైదరాబాద్: Telangana Pollution Control Board | తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య కారక పరిశ్రమలపై Telangana పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (TGPCB) కొరఢా ఝలిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రమాణాలను ఉల్లంఘించిన ఎన్నో యూనిట్లను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్చరించి, కొన్నింటిని మూసివేసినట్లుగా తెలిసింది.
రాష్ట్రంలో మొత్తం 12,264 యూనిట్లు నమోదు కాగా.. అందులో 1,234 యూనిట్లకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు జారీ చేసింది. వీటిలో 305 యూనిట్లకు షట్‌డౌన్ ఆదేశాలు జారీ అయ్యాయి.
కొత్తగా 2,620 పరిశ్రమలకు యూజ్-ఆపరేషన్ కన్సెంట్ ఇచ్చింది. 3,521 యూనిట్లు ఏర్పాటుకు అనుమతులు పొందాయి.
Telangana Pollution Control Board | కాలుష్య నమూనాల సేకరణ..
నేల, నీరు, గాలి కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విస్తృతంగా చర్యలు తీసుకుంటోంది. దాదాపు 7,966 నీటి నమూనాలు, 3,807 గాలి ప్రమాణాల నమూనాలు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సేకరించింది. కాలుష్యం వ్యాప్తి చేస్తున్న సుమారు 500 యూనిట్లపై ఆన్లైన్లో మానిటరింగ్ చేస్తోంది.
