Homeక్రీడలుTeam India | భార‌త్ ముందు భారీ లక్ష్యం.. క‌నీసం డ్రాకి అయిన ప్ర‌య‌త్నిస్తారా?

Team India | భార‌త్ ముందు భారీ లక్ష్యం.. క‌నీసం డ్రాకి అయిన ప్ర‌య‌త్నిస్తారా?

న్యూజిలాండ్‌తో 0-3 తేడాతో సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అయిన తర్వాత, మరో సిరీస్ పరాజయం గౌతమ్ గంభీర్ కోచింగ్ కెరీర్‌పై పెద్ద మచ్చగా మిగిలే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌లోను భార‌త్ ఓట‌మి దిశ‌గా సాగుతుంద‌నే చెప్పాలి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Team India | సౌతాఫ్రికా (South Africa)తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ టీమిండియా నిరాశ‌ప‌రిచింది. గువాహటిలో బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించిన పిచ్‌పై భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ దారి పట్టి అభిమానులను నిరాశపరిచారు.

ఇప్పటికే బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన చేసిన భారత్, బ్యాటింగ్‌లోనూ తీవ్రంగా కుప్పకూలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)(58) మాత్రమే కాస్త పోరాడగా, మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్(22), సాయి సుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0), రిషభ్ పంత్ (Rishabh Pant)(7), నితీష్ రెడ్డి(10), రవీంద్ర జడేజా(6) తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.201 ప‌రుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది.

Team India | మార్కో జాన్సెన్ ధాటికి..

బ్యాటింగ్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన మార్కో జాన్సెన్, బౌలింగ్‌లోనూ అదే ఊపుతో టీమిండియా (Team India) పతనాన్ని వేగవంతం చేశాడు.జాన్సెన్ 4 వికెట్లు, సిమన్ హర్మర్ 2 వికెట్లు ఈ ఇద్దరు బౌలర్ల ఆగ్రసివ్ స్పెల్స్‌తో భారత్ పరిస్థితి మరింత దారుణంగా మారింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 489 పరుగులతో భారీ స్కోర్ అందుకుంది.సెనరన్ ముత్తుసామి 109 ప‌రుగులు చేయ‌గా, మార్కో జాన్సెన్ 93 ప‌రుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/115) మాత్రమే ప్రభావం చూపగలిగాడు. అయితే సొంత గ‌డ్డ‌పై బౌలింగ్‌లోను, బ్యాటింగ్‌లోను భార‌త జ‌ట్టు ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌డం లేదు. ఆతిథ్య జ‌ట్టు సునాయాసంగా ఆడుతుంటే భార‌త జ‌ట్టు మాత్రం ప‌రుగులు రాబ‌ట్టాల‌న్నా, వికెట్స్ తీయాల‌న్నా కూడా చెమ‌టోడ్చాల్సి వ‌స్తుంది.

సౌతాఫ్రికారెండో ఇన్నింగ్స్‌లో లంచ్ స‌మ‌యానికి ద‌క్షిణాఫ్రికా నాలుగు వికెట్ల న‌ష్టానికి 220 ర‌న్స్ చేసింది. మ‌ల్డ‌ర్ 29, స్ట‌బ్స్ 60 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 508 ర‌న్స్ లీడ్‌లో ఉన్న‌ది. ఓపెన‌ర్లు రికెల్ట‌న్‌(35), మార్‌క్ర‌మ్‌(29)తో పాటు కెప్టెన్ బ‌వుమా (3), జోరీ (49) ఔట‌య్యారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌డేజా మూడు, సుంద‌ర్ ఓ వికెట్ తీసుకున్నారు. లంచ్ త‌ర్వాత స‌ఫారీ జ‌ట్టు బ్యాటింగ్ కొన‌సాగిస్తుందా లేదంటే భార‌త్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానిస్తుందా అనేది చూడాలి. సౌతాఫ్రికా భారీ ఆధిక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, భారత్ ఇన్నింగ్స్ ఓటమి దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు వంద ఓవ‌ర్ల‌ పాటు బ్యాటింగ్ చేయకపోతే పరాజయం తప్పదన్న మాట. ఈ మ్యాచ్ ఓడినా లేదా డ్రాగా ముగిసినా సిరీస్ 1-0తో సౌతాఫ్రికా కైవసం అవుతుంది. ఇప్పటికే మొదటి టెస్ట్‌లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది.