Homeఆంధప్రదేశ్Tata Nagar Express | టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

Tata Nagar Express | టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్​లోని పెందుర్తి రైల్వే స్టేషన్​లో విద్యుత్​ వైర్లపై పోల్​ పడింది. దీంతో ముగ్గురు గాయపడ్డారు. టాటానగర్​ ఎక్స్​ప్రెస్​ను లోకోపైలెట్​ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tata Nagar Express | ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ సమీపంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు (Tata Nagar Express Train) తృటిలో ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్​లో (Pendurthi railway station) పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఓ విద్యుత్​ స్తంభం పక్కకు ఒరిగింది. పక్కనే ఉన్న రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ వైర్లపై పడింది.

రైల్వే ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ విద్యుత్‌ వైర్లపై (power wires) స్తంభం పడటంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన తోటి కార్మికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా స్తంభం పడిన సమయంలోనే అటుగా టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చింది.

Tata Nagar Express | లోకోపైలెట్​ అప్రమత్తత..

విద్యుత్​ వైర్లపై స్తంభం పడిన విషయాన్ని గమనించిన టాటానగర్​ ఎక్స్​ప్రెస్​ లోకోపైలెట్​ (Tatanagar Express locopilot) గమనించాడు. వెంటనే అప్రమత్తం అయి రైలును నిలిపివేశాడు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ ఘటనతో ఆ మార్గంలో దాదాపు గంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనంతరం అధికారులు, సిబ్బంది రాకపోకలను పునరుద్ధరించారు.

ఇటీవల ఛత్తీస్​గఢ్​లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బిలాస్​పూర్​ జిల్లాలోని జైరాంనగర్ స్టేషన్ (Jairamnagar Station) సమీపంలో ప్యాసింజర్​, గూడ్స్​ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మరణించారు. అనంతరం ఉత్తర ప్రదేశ్​లో ట్రాక్​ దాటుతున్న ప్రయాణికులను రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. తాజాగా పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.