Pawan Kalyan | పవన్ కళ్యాణ్​కు షాక్​.. తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు

అక్షరటుడే, అమరావతి : Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Andhra Pradesh Deputy CM Pawan Kalyan)​కు తమిళనాడు Tamil Nadu పోలీసులు షాక్​ ఇచ్చారు. అక్కడి అన్నానగర్ పోలీస్ స్టేషన్‌ లో పవన్ పై కేసు నమోదు చేశారు. గత నెల(జూన్​ 22)లో మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న పవన్ ఉద్వేగ పూరిత ప్రసంగంతో​ మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారనే అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. […]

అక్షరటుడే, అమరావతి : Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Andhra Pradesh Deputy CM Pawan Kalyan)​కు తమిళనాడు Tamil Nadu పోలీసులు షాక్​ ఇచ్చారు. అక్కడి అన్నానగర్ పోలీస్ స్టేషన్‌ లో పవన్ పై కేసు నమోదు చేశారు. గత నెల(జూన్​ 22)లో మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న పవన్ ఉద్వేగ పూరిత ప్రసంగంతో​ మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారనే అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) మురుగన్​ భక్తుల సదస్సు(Murugan devotees’ conference)లో ద్వేషపూరిత ప్రసంగం చేశారనేది అభియోగం. దీనిపై అన్నామలై తో పాటు అనేక మంది నిర్వాహకులపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Pawan Kalyan : పలు సెక్షన్​ల కింద..

పవన్​ కళ్యాణ్​పై మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ న్యాయవాది వంజినాథన్ ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. ఈమేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్​పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196(1)(ఏ), 299, 302, 353(1)(బి)(2)లను కేసులో తమిళనాడు​ పోలీసులు పొందుపర్చారు.

మురుగన్​ భక్తుల సదస్సులో చేసిన ప్రసంగాలు, తీర్మానాలు.. జాతి, మతం, ప్రాంత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేవిగా, సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎఫ్ఐఆర్​లో పొందుపర్చినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan : పవన్​ కళ్యాణ్​ ప్రసంగాన్ని ఓసారి పరిశీలిస్తే…

ఈ సదస్సులో హిందువులు ఒక కూటమిగా ఓటు వేయాలని కోరారు. ఆలయాలను ఆదాయ వనరులుగా పరిగణిస్తున్నందుకు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొన్ని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై పవన్ ప్రసంగిస్తూ… హిందువుల్ని నిలదేసే వారికి అరేబియా నుంచి వచ్చిన మతాల్ని ప్రశ్నించే ధైర్యం ఉందా? అని అన్నారు. మురుగన్‌ భక్తులు ఒక్కచూపు చూస్తే చాలు.. తమ దేవుడిని దూషించే కూటమి కంటికి కనిపించకుండా పోతుందన్నారు. సహజంగా నాస్తికులు భగవంతుడిని నమ్మరని గుర్తుచేశారు. కానీ, కొందరు మాత్రం హిందూ దేవుళ్లనే నమ్మమంటున్నారని వ్యాఖ్యానించారు. హిందూధర్మాన్ని తప్పితే ఇతర వాటిని నిలదీసే ధైర్యం వారికి లేదని పవన్ కళ్యాణ్​ అన్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.