అక్షరటుడే, హైదరాబాద్: Multi Zone-II IGP : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Telangana capital Hyderabad) లో మల్టీ జోన్-II (FAC) IGP గా తఫ్సీర్ ఇక్బాల్ Tafseer Iqbal (IPS) మంగళవారం(జులై 1) బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీగా, మైనారిటీ వెల్ఫేర్ శాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ముఖ్యమైన పదవుల్లో సేవలందించారు.
తఫ్సీర్ ఇక్బాల్ 2008 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. మల్టీ జోన్-II (FAC) IGP గా సత్యనారాయణ జూన్ 30న పదవీ విరమణ పొందటంతో ఆయన స్థానంలో తెలంగాణ ప్రభుత్వం తఫ్సీర్ ఇక్బాల్‌ను నియమించింది. జీహెచ్ఎంసీ GHMC పరిధిలోని మల్టీ జోన్ టూ అనేది చాలా కీలకమైంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారిని అక్కడ నియమించారు.