అక్షరటుడే, వెబ్డెస్క్ : KIA Cars | ఆంధ్రప్రదేశ్లోని కియా kia కంపెనీకి సంబంధించిన కార్ల ఇంజిన్ల చోరీ car engines theft కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం కార్ల తయారీ కంపెనీలో సుమారు 940 ఇంజిన్లు చోరీకి గురైన విషయం తెలిసిందే. దీనిపై కంపెనీ ప్రతినిధులు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఎనిమిది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని తీసుకుని ఢిల్లీ delhi, తమిళనాడు tamil naduకు వెళ్లారు. ఎత్తుకెళ్లిన 940 ఇంజిన్లలో 288 ఇంజిన్లను ఢిల్లీలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వాటిని రికవరీ చేయడానికి అక్కడికి వెళ్లారు. అలాగే మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
