India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: India vs West Indies | ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 (T20 World Cup 2026) సూపర్-8 దశ చివరి అంకానికి చేరుకుంది. చెన్నైలో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా (Team India), సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా (South Africa) చేతిలో ఓటమి పాలైన భారత జట్టు, రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని ఆత్మవిశ్వాసాన్ని చాటింది. అయితే గ్రూప్-1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా జ‌ట్టు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. జింబాబ్వే (Zimbabwe) పోటీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు మిగిలిన ఒక్క స్థానం కోసం భారత్, వెస్టిండీస్ మ‌ధ్య‌ తుది సమరం మిగిలింది.

India vs West Indies | రూట్ క్లియర్ చేసిన సౌతాఫ్రికా విజయం

భారత్, వెస్టిండీస్ జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి చెరో విజయం సాధించి 2 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. దీంతో మార్చి 1న జరిగే ఈ మ్యాచ్ నేరుగా నాకౌట్ తరహాలో మారిపోయింది. ఫిబ్రవరి 26న జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ను ఓడించడం భారత్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత భారత్ జింబాబ్వేపై భారీ స్కోర్ నమోదు చేసి విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో పరిస్థితి మారింది. ఇప్పుడు గెలిచిన జట్టే సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 4 పాయింట్లు వ‌స్తాయి. ఓడిన జట్టు 2 పాయింట్లతోనే ఆగిపోతుంది. కాబట్టి నెట్ రన్ రేట్ లెక్కలు అవసరం లేకుండానే విజేత సెమీఫైనల్ టికెట్ దక్కించుకుంటుంది.

వెస్టిండీస్ జట్టు తుది మ్యాచ్‌ల్లో ఎప్పుడూ ప్రమాదకరమే. పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన కరేబియన్ బ్యాటర్లు మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపుతిప్పగలరు. భారత్ కాస్త అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Captain Suryakumar Yadav) నాయకత్వంలో జట్టు సమన్వయంగా ఆడుతోంది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. జింబాబ్వేపై 256 పరుగుల భారీ స్కోరు నమోదు చేయడం జట్టుకు భారీ ఉత్సాహాన్ని ఇచ్చింది. బౌలింగ్ విభాగం కూడా కీలక సమయంలో వికెట్లు తీస్తూ స‌త్తా చూపుతోంది. ఈ ప్రదర్శన కొనసాగితే వెస్టిండీస్‌ను ఓడించడం సాధ్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, గ్రూప్-1 నుంచి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరో తేల్చే ఈ ‘సూపర్ సండే’ పోరు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. భారత్ తన జోరు కొనసాగించి సెమీస్ బెర్త్ సాధిస్తుందా? లేక వెస్టిండీస్ సెన్సేషన్ సృష్టిస్తుందా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాల‌ర్ల‌ ప్రశ్నగా మారింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...