అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. రూ.లక్ష లంచం తీసుకుంటుంగా.. సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు (ACB officials) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో (Secunderabad Tahsildar office) సర్వేయర్‌గా పని చేస్తున్న కిరణ్ తాజాగా ఏసీబీకి చిక్కాడు. కాలువ కిరణ్‌కుమార్ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. ఓ వ్యక్తి ఆస్తిపై జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆయన రూ.3 లక్షల లంచం (bribe) డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా సర్వేయర్ తన సహాయకుడు, కార్యాలయంలో పని చేసే చైన్మన్ ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ACB Trap | నిజామాబాద్‌లో సోదాలు
సర్వేయర్ కిరణ్ గతంలో నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) సుదీర్ఘ కాలం పని చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్‌గా, ఏడీ కార్యాలయంలో ఏళ్లుగా కొనసాగారు. ఆ సమయంలోనూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాగా ఒకసారి ఏసీబీ ట్రాప్ నుంచి తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం సికింద్రాబాద్‌కు బదిలీపై వెళ్లారు. తాజాగా ఏసీబీకి చిక్కడంతో నిజామాబాద్‌లో ఆయన ఇంట్లో, ఏడీ కార్యాలయంలో సైతం తనిఖీలు చేపట్టారు.
1 comment
[…] […]
Comments are closed.