అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మరోసారి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ఆయన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ (Bhopal)లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Trump) బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడ్డారని ఆరోపించారు. ట్రంప్ ఫోన్ బెదిరింపులకు మోడీ లొంగిపోయారన్నారు. ‘‘ఆపరేషన్ ప్రారంభం కాగానే ట్రంప్ ఫోన్ చేశారు. నరేందర్.. సరెండర్ అనగానే.. జీ హుజూర్’’ అన్నారని విమర్శించారు.
సరెండర్ కావడం బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్ (RSS)కు అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ భయంతోనే మోదీ పాకిస్తాన్ (Pakistan)తో కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
1971లో పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) ఎవరికి భయపడలేదని ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ గతంలో సైతం ఆపరేషన్ సిందూర్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. భారత్ ఎన్ని జెట్లు కోల్పోయిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆపరేషన్ గురించి పాకిస్తాన్‌కు కేంద్రం ముందుగా సమాచారం ఇచ్చిందని ఆయన ఆరోపించారు.