అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | పోలవరం – నల్లమల సాగర్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కోర్టు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) నిర్మిస్తున్న పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ మను వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) కేసును ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని కోర్టుకు తెలిపింది. రిట్ పిటిషన్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, ఇతర మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు తెలిపింది.
Supreme Court | ఆ రాష్ట్రాల వాదనలు వినాలి
ఏపీ సర్కార్ పొలవరం నుంచి బనకచర్లకు నీటిని తరలించేందుకు నల్లమల సాగర్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీనికి ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ వాదించింది. ఆ ప్రాజెక్ట్‌తో రాష్ట్ర జల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని పేర్కొంది. దీనిపై కోర్టు స్పందిస్తూ.. గోదావరి జలాల పంపిణీలో కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా సంబంధం ఉందన్నారు. దీంతో ఆ రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Supreme Court | పోరాటం కొనసాగిస్తాం
సుప్రీంకోర్టు విచారణ అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) మీడియాతో మాట్లాడారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కోర్టుకు అభ్యంతరం చెప్పామన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుపై రెండు రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఒకటి.. చేస్తుంది మరొకటని ఆయన పేర్కొన్నారు.