అక్షరటుడే, న్యూఢిల్లీ: Chief Justice BR Gavai కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ మండిపడ్డారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులను పార్లమెంటు కూడా పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు.
2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో ఫిల్మ్ సర్టిఫికేషన్ ట్రిబ్యునల్‌తో పాటు పలు ట్రైబ్యునల్లు రద్దు అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మద్రాస్ బార్ అసోసియేషన్, మరికొందరు పిటిషన్ దాఖలు చేశారు.
Chief Justice BR Gavai : కీలక నిబంధనల కొట్టివేత..
ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్రంగా స్పందించారు. గతంలో న్యాయస్థానం కొట్టివేసిన పలు నిబంధనలకు స్వల్ప మార్పులు చేసి, కొత్త చట్టాలు తీసుకురావడం రాజ్యంగా విరుద్ధమని స్పష్టం చేశారు.
ఈ కేసు వాయిదా వేయాలని, ఇతర బెంచ్‌కు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా.. నా నుంచి తప్పించుకుందామని, నేను పదవీ విరమణ పొందే వరకు తీర్పు రావొద్దని అనుకుంటున్నారా..? అంటూ ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు.
కోర్టు తీర్పులను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడం సరికాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. ట్రైబ్యునళ్ల సంస్కరణ 2021 చట్టంలోని కీలక నిబంధనలను కొట్టివేస్తూ తీర్పు నిచ్చారు.
