HomeUncategorizedSupreme Court | కప్పు కాఫీ కలిసి తాగితే ఎన్నో మార్పులు.. విడాకుల కోసం వచ్చిన...

Supreme Court | కప్పు కాఫీ కలిసి తాగితే ఎన్నో మార్పులు.. విడాకుల కోసం వచ్చిన జంటకు సుప్రీం సూచన

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : విడాకుల(divorce) కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ జంటకు సుప్రీంకోర్టు సరికొత్త సూచన చేసింది. ఇద్దరి మధ్య ఉన్న మనోవిభేదాలు పరిష్కరించుకునేందుకు డిన్నర్ కలిసి చేయాలని, కప్పు కాఫీ కలిసి తాగాలని సజేషన్​ ఇచ్చింది. అలా చేయడం వల్ల పెద్ద మార్పు తలెత్తవచ్చని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

భర్త నుంచి విడాకులు కోరిన ఓ మహిళ తన మూడేళ్ల బిడ్డతో విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోరుతూ పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ (Justices B.V. Nagaratna, Justices Satish Chandra Sharm)లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

“మీకు మూడేళ్ల బిడ్డ ఉంది. ఇద్దరి మధ్య అహం ఏమిటి?” అని ధర్మాసనం ప్రశ్నించింది. “గతాన్ని ఛేదు మాత్రలా మింగేసి, భవిష్యత్తు కోసం ఆలోచించాలి” అని న్యాయస్థానం సూచించింది.

“మీ కోసం మా క్యాంటీన్(canteen) అంత మంచిది కాకపోవచ్చు. కానీ, మేము మీ కోసం మరో డ్రాయింగ్ రూమ్(drawing room) సిద్ధం చేస్తాం. మీరు ఈ రోజు విందులో పాల్గొనండి. ఒక కప్పు కాఫీ తాగితే మానసికంగా చాలా పరిష్కారం లభిస్తుంది” అని ధర్మాసనం హితవు పలికింది.

ఇలా చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఇరు పక్షాలు ఒకరితో ఒకరు మాట్లాడుకొని మంగళవారం తిరిగి కోర్టుకు హాజరుకావాలని పేర్కొంది. కాగా.. సుప్రీం తీర్పు చర్చకు దారితీసింది.