అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి (Subrahmanya Shashti)ని పురస్కరించుకుని ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని సుబ్రమణ్య స్వామి ఆలయం (Subrahmanya Swamy Temple)లో భక్తులు బుధవారం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేశారు.
అనంతరం సుబ్రహ్మణ్యస్వామి వల్లి దేవసేనలతో కల్యాణ మహోత్సవం (Kalyana Mahotsavam) కన్నుల పండుగ నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్ఠి అని కూడా అంటారని ఆలయ పండితులు శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని, ఆపదలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సంతానం కోరుకునే వాళ్లు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలని చెప్పారు. కార్యక్రమంలో గురు స్వాములు చంద్రం, కృష్ణారెడ్డి, రాజేంద్రనాథ్, కల్యాణ మహోత్సవం నిర్వహించిన సుగుణాకర్ దంపతులు పాల్గొన్నారు.