అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | విద్యార్థులు ప్రణాళికతో చదివి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి ఆర్ఎల్సీ అబ్దుల్ బషీర్ పేర్కొన్నారు. లింగంపేట్ మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలను (Telangana Minority Boys Gurukul School) బుధవారం సందర్శించారు.
విద్యార్థులను కలిసి వారికి అందుతున్న వసతులను, విద్యా సంబంధ విషయాలపై చర్చించారు. విద్యార్థులు త్వరలో జరుగబోయే బోర్డు పరీక్షలకు సరైన ప్రణాళికతో చదవాలని సూచించారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. పాఠశాలలోని వసతులను, రికార్డులను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలను సరైన విధంగా నిర్వహిస్తూ.. ఆదర్శ పాఠశాలగా రూపొందింస్తున్న ప్రిన్సిపాల్ వెంకటరాములును అభినందించారు.
