అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని మోడల్ హైస్కూల్లో వీహెచ్‌పీ, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని (Nasha Mukta Bharat program) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్తు పదార్థాలు తీసుకుంటే వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించారు.
Yellareddy | డ్రగ్స్ నివారణపై అవగాహన..
విద్యార్థులకు డ్రగ్స్‌కు (drugs) దూరంగా ఉండాలని కార్యకర్తలు సూచించారు. ఎక్కడైనా గంజాయి కాని ఇతర ఏ మత్తు పదార్థాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ వాడడంతో విచక్షణ కోల్పోయి తప్పులు చేస్తారని.. సమాజం పెడదోవ పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, ఎక్సైజ్ సీఐ షకీద్, ఏఎస్సై దేవ్ గౌడ్, దేవి హాస్పిటల్ డాక్టర్ యశ్వంత్ రామచంద్ర, మోడల్ హైస్కూల్ ప్రిన్సిపల్ గాంధీ, విశ్వహిందూ పరిషత్ ఎల్లారెడ్డి అధ్యక్షుడు నవీన్, తులసి దాస్, వినోద్, భరత్, రాహుల్, సందీప్ బన్నీ ప్రకాష్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
