అక్షరటుడే, ఇందూరు : Lions Club | విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని మండల విద్యాశాఖ అధికారి ఎం.సాయరెడ్డి తెలిపారు. నగరంలోని కస్బాగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో (Government Girls High School) గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో సాయరెడ్డి (MEO Sayareddy) మాట్లాడుతూ.. విద్యార్థులు పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష, కార్యదర్శులు లింబాద్రి, రాఘవేందర్, కోశాధికారి రాజేందర్, పూర్వాధ్యక్షుడు చింతల గంగాదాస్, ప్రోగ్రాం ఛైర్మన్ యెండల ప్రశాంత్, పాఠశాల ఉపాధ్యాయులు సుజాత, అస్మా జరీన్ తదితరులు పాల్గొన్నారు.