అక్షరటుడే, ఆర్మూర్: Volleyball tournament | రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీకి (state-level volleyball tournament) ఆర్మూర్, భీమ్గల్ మండలాల నుంచి అండర్–14 విద్యార్థులు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లాలో ఈనెల 26వ తేదీ నుంచి 28వరకు పోటీలు జరుగనున్నాయి.
Volleyball tournament | ఆర్మూర్ మండలం మగ్గిడి నుంచి..
ఆర్మూర్ మండలం మగ్గిడి ఉన్నత పాఠశాల విద్యార్థులు హిమప్రియ, ప్రణీత, రిషికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాలీబాల్ జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం తిరునగరి హరిత తెలిపారు. ఎంపికైన విద్యార్థులు పెద్దపల్లిలో టోర్నీలో పాల్గొంటారన్నారు. ఎంపికైన విద్యార్థినులను పీడీ మధుసూదన్, మగ్గిడి గ్రామ తాజా మాజీ సర్పంచ్ సుమలత నర్సయ్య, వీడీసీ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
Volleyball tournament | భీమ్గల్ నుంచి..
అక్షరటుడే, భీమ్గల్: Volleyball tournament | మండలంలోని బడా భీమ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కృష్ణస్వామి తెలిపారు. ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన వాలీబాల్ క్రీడల ఎంపికలో భాగంగా పాఠశాలకు చెందిన ఎం.వైశాలి, ఓ.శ్రీనిత్ ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను హెచ్ఎంతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మోర్తాడ్ లింబాద్రి, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు.

