Homeజిల్లాలునిజామాబాద్​Mupkal | అనారోగ్యంతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి

Mupkal | అనారోగ్యంతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతి

ముప్కాల్​ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పొన్న సంజన(15) విద్యార్థిని బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యనభ్యసిస్తోంది. అనారోగ్య కారణాలతో ఆదివారం విద్యార్థిని మృతి చెందింది.

- Advertisement -

అక్షరటుడే,ముప్కాల్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పొన్న సంజన(15) విద్యార్థిని గతేడాది ముప్కాల్ జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసింది. 565 మార్కులతో బాసర ( Basar) ట్రిపుల్ ఐటీలో (Triple IT) సీట్ సాధించి విద్యను అభ్యసిస్తుంది.

Mupkal | అనారోగ్య కారణాలతో..

కాని అనారోగ్య కారణంతో ఆదివారం రోజు మధ్యాహ్నం కళాశాలలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, ఉన్నత పాఠశాల అధ్యాపకులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఇలా అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.