అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | టీనేజీలో ప్రేమ వ్యవహారాలు (Love affairs) విలువైన జీవితాలను బలి తీసుకుంటున్నాయి. ఫలితంగా తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుతోంది.
కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) వాంబే కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని ఇంట్లోని బాత్ రూంలో సోమవారం ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కొనఊపిరితో ఉన్న బాలికను జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. స్థానికుల కథనం ప్రకారం.. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ యువకుడితో బాలికకు ప్రేమ వ్యవహారం కొనసాగింది. అయితే పెళ్లి విషయంలో సదరు యువకుడు నిరాకరించడంతో మనస్తాపం చెందిన బాలిక సోమవారం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
