అక్షరటుడే, బాన్సువాడ : Chinese Manja | చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాఘవేందర్ (SI Raghavender) తెలిపారు. నస్రుల్లాబాద్ మండలం (Nasrullabad Mandal)లో చైనామాంజా విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. తన సిబ్బందితో కలిసి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లోని పలు కిరాణా షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.
Chinese Manja | దుకాణాల్లో తనిఖీలు..
షాపుల్లో చైనామాంజా నిల్వలపై తనిఖీలు చేపట్టారు. ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా అమ్మకం లేదా నిల్వలు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. చైనా మాంజా వల్ల పక్షులు, జంతువులు మాత్రమే కాకుండా మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై నిషేధం విధించిందని తెలిపారు. నిషేధిత చైనా మాంజాను అమ్మినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నివారించి, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.