HomeUncategorizedYogi Adityanath | యూపీ సీఎం యోగి పాలనపై ఎస్పీ ఎమ్మెల్యే ప్రశంసలు.. సస్పెండ్ చేసిన...

Yogi Adityanath | యూపీ సీఎం యోగి పాలనపై ఎస్పీ ఎమ్మెల్యే ప్రశంసలు.. సస్పెండ్ చేసిన పార్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​​ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఎన్​కౌంటర్లతో రౌడీ షీటర్లలో ఆయన భయం పుట్టించారు. అంతేగాకుండా బుల్డోజర్లతో నేరాలకు పాల్పడే వారి ఆస్తులను ధ్వంసం చేస్తూ బుల్డోజర్​ బాబాగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన పాలనలో చాలా వరకు నేరాలు తగ్గాయి.

యూపీలో 2017 నుంచి దాదాపు 15 వేల ఎన్​కౌంటర్లు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇందులో 239 మంది చనిపోగా.. సుమారు 9 వేల మంది గాయపడ్డారు. 8 ఏళ్లలో 30 వేలకు పైగా నేరస్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. యోగి (Yogi) మార్క్​ పాలనతో నేరస్తులు బయట ఉండడం కంటే జైలులో ఉండడమే బెటర్​ అని భావిస్తున్నారు. దీంతో చాలా మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో యోగి పాలనపై సమాజ్​వాద్​ పార్టీ ఎమ్మెల్యే (SP MLA) పూజాసింగ్​ ప్రశంసలు కురిపించారు.

Yogi Adityanath | మాఫియాపై ఉక్కుపాదం

ఉత్తర ప్రదేశ్​లో మాఫియా ఆగడాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉక్కుపాదం మోపుతున్నారని ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్‌ (Pooja Singh) అన్నారు. కాగా ఆమె భర్త రాజుపాల్​ను (బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే) 2005లో హత్య చేశారు. ఈ కేసులో నిందితుడిగా అతీక్​ అహ్మద్ గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. దీంతో యోగి ప్రభుత్వం తనతోపాటు అనేక మంది మహిళాలకు న్యాయం చేసిందని పూజపాల్​ అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. తన భర్తను హత్య చేసిన అతీక్‌ అహ్మద్‌పై చర్యల కోసం తాను ఏళ్లుగా పోరాటం చేశానని ఆమె గుర్తు చేశారు. ఎట్టకేలకు సీఎం యోగి తనకు న్యాయం చేశారన్నారు. నేరగాళ్లపై తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రిపై విశ్వాసంతో ఉందని ఆమె అన్నారు.

Yogi Adityanath | అతీక్​ అహ్మద్​ ఎవరంటే..

ఉత్తర ప్రదేశ్​లో 2005లో బీఎస్పీ (BSP) ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకు గురయ్యారు. పూజాపాల్‌తో వివాహం అయిన 10 రోజులకే ఆయనను హతమార్చారు. ఉప ఎన్నికల్లో రాజుపాల్​ చేతిలో ఓడిపోయిన అష్రాఫ్‌ అహ్మద్‌ తన సోదరుడు అతీక్‌ సాయంతో ఈ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా అతీక్‌ అహ్మద్‌ గ్యాంగ్​స్టార్​ నుంచి రాజకీయ నేతగా ఎదిగాడు. ఎమ్మెల్యేగా, ఎంపీగా సైతం పని చేశాడు. పలు కేసుల్లో అతీక్‌, అష్రాఫ్‌లు నేరస్తులుగా తేలారు. ఈ క్రమంలో 2023లో ఓ కేసు విచారణ నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. విలేకరుల ముసుగులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇద్దరిని కాల్చి చంపారు. అంతకు కొన్ని గంటల ముందే అతిక్​ కుమారుడు అసద్‌ పోలీస్​ ఎన్​కౌంటర్​లో (Encounter) మరణించాడు.

Yogi Adityanath | వేటు వేసిన పార్టీ

యూపీ సీఎం ప్రశంసల వర్షం కురిపించిన పూజాపాల్​పై సమాజ్​వాద్​ పార్టీ వేటు వేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్​ యాదవ్ (Akshilesh Yadav)​ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణారాహిత్యం కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పూజాపాల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని.. హెచ్చరించినా మారలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో పార్టీకి నష్టం జరగడంతో చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.