అక్షరటుడే, వెబ్‌డెస్క్: smriti mandhana wedding celebrations | వరల్డ్‌కప్ విజయంతో ఉత్సాహం మీద ఉన్న టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన Smriti Mandhana వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్ పూర్తి కాగా, ఈ జంట నవంబర్ 23న వివాహ బంధంతో ఒక్కట కానున్నారు. గత రెండు మూడు రోజులుగా స్మృతి పెళ్లి కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రీసెంట్‌గా హల్దీ వేడుక జరగగా, ఆ కార్యక్రమంలో తోటి క్రికెటర్స్ పాల్గొని సందడి చేశారు. డ్యాన్సులు చేస్తూ హంగామా చేశారు.ఇక శనివారం జరిగిన ఈ జంట మెహందీ వేడుకల్లో సహచర క్రికెటర్లు రాధా యాదవ్, జెమీమా,అరుంధతి, శ్రేయాంక తదితరులు పాల్గొని సందడి చేశారు.
smriti mandhana wedding celebrations | పెళ్లి సందడి..
స్మృతి గురించి దేశవ్యాప్తంగా చాలా మందికి సుపరిచితం. ఆమెను పెళ్లి చేసుకోబోతున్న పలాష్ ముచ్చల్ palash muchhal గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన పలాష్ ఒక నటుడిగా కూడా పనిచేశారు. అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ‘ఖేలేన్ హమ్ జీ జాన్ సె’ సినిమాలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణెతో కలిసి పలాష్ ‘జుంకూ’ పాత్రలో నటించారు. తరువాత నటన నుంచి వైదొలగి సంగీత రంగంపై పూర్తిగా దృష్టి సారించిన పలాష్, సన్నీ దేఓల్ నటించిన ‘డిష్యం’ సినిమాతో సంగీత దర్శకుడిగా మారారు. ‘భూత్‌నాథ్ రిటర్న్స్’లోని హిట్ సాంగ్ ‘పార్టీ తో బంతీ హై’ ఆయన కెరీర్‌లో పెద్ద బ్రేక్‌గా నిలిచింది. మ్యూజిక్ మాత్రమే కాకుండా పలాష్ డైరెక్షన్‌లో కూడా తన ప్రతిభను చూపించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘కామ్ చాలూ హై’ సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది.
పలాష్ బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ సొంత తమ్ముడు అన్న విషయం చాలామందికి తెలియదు. పేద పిల్లల గుండె శస్త్రచికిత్సలకు తమ కుటుంబం సేవలు అందిస్తూ ఉంటుంది. మంచి విలువలు గల కుటుంబం కావడంతో స్మృతి కుటుంబం ఈ పెళ్లికి వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం. ఆస్తుల విషయానికి వస్తే స్మృతి మంధాన సుమారుగా రూ. 33 కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉండగా, పలాష్ ముచ్చల్ నెట్‌వర్త్ రూ. 25 కోట్ల నుంచి రూ. 40 కోట్ల మధ్యగా అంచనా. ఇద్దరి కలిపి ఆస్తులు దాదాపు రూ. 70 కోట్లకు చేరుతున్నాయి. వీరి లవ్ స్టోరీ క్లైమాక్స్ సినిమాను తలపించేలా ఉంది. వరల్డ్‌కప్ ఫైనల్‌లో World Cup Final స్మృతి విజయం సాధించిన ముంబయి డీవై పాటిల్ స్టేడియం మధ్యలో పలాష్ మోకాళ్లపై కూర్చొని ఆమెకు ప్రపోజ్ చేశారు. స్మృతి కళ్లకు గంతలు కట్టి పిచ్ మధ్యకు తీసుకెళ్లి రింగ్ తొడిగిన ఆ క్షణం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
