అక్షరటుడే, కోటగిరి: Kotagiri | పోతంగల్ మండలం పీఎస్ఆర్నగర్ వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల(Integrated school) నిర్మాణ స్థలాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Mla Pocharam Srinivas Reddy), ఆగ్రోస్ ఇండస్ట్రీస్(Agros Industries) ఛైర్మన్ కాసుల బాలరాజ్ ఆదివారం స్థల పరిశీలన చేశారు. పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరవగా చెక్పోస్ట్ నుంచి హున్నా వరకు 11కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డుగా మలిచేందుకు మరో రూ.30 కోట్లు మంజూరయ్యాయి.
Pothangal | రేపు శంకుస్థాపనలు..
ఆయా అభివృద్ధి పనులకు సోమవారం వీరు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమయ్యే అన్ని వసతులతో కూడిన పాఠశాల భవన నిర్మాణం చేపడుతుండడంపై ఆనందం వ్యక్తం చేశారు.
సింగిల్ రోడ్డు ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దాంతో ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు రూ.30 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, కాంగ్రెస్ నాయకులు, కొట్టం మనోహర్, ఎజాజ్ ఖాన్, కేశ వీరేశం, పత్తి లక్ష్మణ్, గంట్ల విఠల్, షాహిద్, హంగర్గా గంగాధర్, మానిక్ అప్ప, బర్ల మధు, షాజీ, జుబేర్, పోచీరాం, మాధవరావు పటేల్, రాంబాబు, జగన్, ధన్రాజ్, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
