అక్షరటుడే, వెబ్డెస్క్ : MLC Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Mallanna) హైకోర్టును ఆశ్రయించారు. తన పార్టీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) ను పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బీసీలకు అధికారమే తన లక్ష్యమని ప్రకటించారు.
MLC Mallanna | చర్యలు తీసుకోవాలని సూచన
మల్లన్న పిటిషన్పై మంగళవారం హైకోర్టు(High Court) విచారణ చేపట్టింది. టీఆర్పీ పార్టీ గుర్తింపు, గుర్తుపై ఆయన పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) పోటీ చేసేందుకు వీలు కల్పించాలని కోరారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసంన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.బీసీలకు రాజ్యాధికారం, ఆత్మగౌరవం నినాదంతో మల్లన్న పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్మిక, కర్షకులకు చిహ్నంగా ఆయన జెండాను రూపొందించారు. జెండాలో కార్మిక చక్రం, ఆలీవ్ ఆకులు, పిడికిలి ముద్రించారు. అయితే ఆయన ఇటీవల పార్టీ పెట్టడంతో ఇంకా గుర్తును కేటాయించలేదు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే గుర్తుపై పోటీ చేయడానికి తమ పార్టీకి సింబల్ కేటాయించాలని ఆయన కోరారు. దీంతో ఎన్నికల సంఘం ఏ గుర్తు కేటాయిస్తుందో చూడాలి.