అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New York | అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అగంతకుడి కాల్పల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అనంతరం అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్ నగరంలోని (New York City) పార్క్ అవెన్యూ టవర్‌లోని మిడ్‌టౌన్ మాన్‌హట్టన్ కార్యాలయ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు అధికారితో సహా ఐదుగురు మరణించారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.
New York | రద్దీ ప్రాంతంలో కాల్పులు
రద్దీగా ఉండే పార్క్ అవెన్యూ కార్యాలయ భవనంలో (Park Avenue office building) కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. 345 పార్క్ అవెన్యూలో ఉన్న 634 అడుగుల ఆకాశహర్మ్యంలో నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (National Football League), బ్లాక్‌స్టోన్‌లకు సంబంధించిన కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనం మొత్తం నగర బ్లాక్‌ను ఆక్రమించింది మరియు దాని సొంత జిప్ కోడ్‌తో 41 న్యూయార్క్ నగర భవనాలలో ఒకటి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోకి బుల్లెట్ ప్రూఫ్ ధరించి ఏఆర్ రైఫిల్‌తో (AR rifle) వచ్చిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసు అధికారి సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకున్నాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాల్పుల శబ్ధం విని అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయారు.
New York | నెవెడా వాసిగా గుర్తింపు..
సమాచారమందుకున్న పోలీసులు హుటాహటిన అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని నెవాడాకు చెందిన షేన్ తమురాగా గుర్తించారు. లాస్ వెగాస్ నుండి దాచిన క్యారీ పర్మిట్ సహా తమురా మృతదేహంపై చట్ట అమలు అధికారులు గుర్తింపు పత్రాలను కనుగొన్నారు. పార్క్ అవెన్యూ కార్యాలయ భవనం వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని న్యూయార్క్ నగర పోలీసులు (New York City police) తెలిపారు. అయితే, నిందితుడు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడని ఇంకా వెల్లడి కాలేదు.