అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actress Dia Mirza | సినీ పరిశ్రమలో (Film Industry) హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే అందం, ఫిట్‌నెస్, అదృష్టం, టాలెంట్ కావాలని చాలా మంది నమ్మకం. కానీ బాలీవుడ్ నటి దియా మీర్జా (Actress Dia Mirza) కథ మాత్రం ఈ నియమానికి పూర్తి విరుద్ధం.
అందం ఉన్న అమ్మాయిలకు అవకాశాలు ఎక్కువగా వస్తాయనే సెంటిమెంట్ ఈ అమ్మడి విషయంలో తలకిందులు అయింది. దియా మీర్జా మరింత అందంగా ఉందన్న కారణంగానే అనేక మంచి అవకాశాలను కోల్పోయినట్లు తనే వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Actress Dia Mirza | “నా అందమే నాకు శత్రువైంది”
దియా మీర్జా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించింది. ఎక్కువ అందం, క్లాస్ లుక్ వల్ల చాలా మంది దర్శకులు నా విషయంలో వెనక్కి తగ్గేవారని చెప్పింది. నేను కోరుకున్న మంచి స్క్రిప్ట్‌లకు చాలా అందంగా ఉంటానని దర్శకులు నో చెప్పేవారు. ఆ పాత్రకు నిన్ను తీసుకోలేమని చెప్పి తిరస్కరించారు. దియా చెప్పిన ఈ మాటలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో (Social Media) హాట్ టాపిక్ అయ్యాయి. ఎక్కువ అందం ఉన్నా కూడా ఇండస్ట్రీలో సమస్యనేనా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. ఇక దియా మీర్జా తండ్రి జర్మన్ కాగా, తల్లి బెంగాలి. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి రెండో పెళ్లి తర్వాత ఆమె మీర్జా అనే ఇంటిపేరును తగిలించుకుంది. 2000లో ‘మిస్ ఏషియా పసిఫిక్ ఇంటర్నేషనల్’ (Miss Asia Pacific International) కిరీటం గెలిచిన తర్వాత ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది.
2001లో మాధవన్ సరసన నటించిన రెహనా హై తేరే దిల్ మే (RHTDM) సినిమాలో దియా మీర్జా అందం, సహజ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాధవన్–దియా జంట అప్పట్లో యూత్‌లో వైరల్ అయ్యింది. అయితే ఈ డ్రీమ్ డెబ్యూ తర్వాత ఆఫర్లు తగ్గిపోయాయి.. కారణం ‘అందం’. డైరెక్టర్లు నన్ను ‘మెయిన్ స్ట్రీమ్ బ్యూటీ’గా మాత్రమే చూశారు. కానీ నేను కోరుకున్న మంచి కథల పాత్రలకు నా అందం సమస్య అని చెప్పి నన్ను తీసుకోలేదని చెప్పుకొచ్చింది. అంటే దియా మీర్జా నటన కంటే, ఆమె నాజూగ్గా కనిపించే లుక్ వల్ల కొందరు దర్శకులు రియలిస్టిక్ పాత్రలకు సెట్ కాదని భావించారు. అర్ధవంతమైన సినిమాలు చేయాలనుకున్నాను. కానీ నన్ను చూసిన వెంటనే ఎవరు కూడా ఆ పాత్రలో ఇమేజిన్ చేయలేకపోయారనే దియా మీర్జా వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి.
