అక్షరటుడే, బాన్సువాడ: Chandur | చందూర్ మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాలలో (Minority Gurukula Welfare School) ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై స్పందిచిన ఉన్నతాధికారులు హాస్టల్ సిబ్బందిపై (hostel staff) మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు.
వివరాల్లోకి వెళ్తే.. చందూర్ మండల (Chandur mandal) కేంద్రంలోని మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాల హాస్టల్లో ఈనెల 23వ తేదీన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్లో విద్యార్థులు, సిబ్బంది ఉన్నప్పటికీ విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో అధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు.
Chandur | ఇంటి నుంచి వచ్చిన మరుసటి రోజే..
సూసైడ్‌కు పాల్పడిన విద్యార్థి గౌస్(14) ఒకరోజు ముందే ఇంటి నుంచి వచ్చి హాస్టల్లో చేరాడు. వసతిగృహంలోనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఉదయం వరకు గుర్తించడంలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ అనిల్‌ను సస్పెండ్ చేశారు. ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న టీచింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డుపై సైతం సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారిణి కృష్ణవేణి ఉత్తర్వులు జారీ చేశారు.
