అక్షరటుడే, వెబ్డెస్క్ : Chinese manja | హైదరాబాద్ నగరంలో (Hyderabad City) చైనా మాంజాతో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదకరమైన చైనా మాంజా (Chinese manja) విక్రయాలపై నగర పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అయినా కొందరు దొంగచాటుగా విక్రయాలు చేపడుతున్నారు. దీంతో చైనా మాంజా రోడ్లపై, విద్యుత్ స్తంభాలకు చిక్కుకోవడంతో ప్రజలు గాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఇద్దరు గాయపడ్డారు. యాచారం మండలంలో బైక్పై వెళ్తున్న మధు అనే యువకుడి మెడకు మాంజా చుట్టుకుంది. దీంతో అతడి మెడ కోసుకుపోయింది. అంబర్పేట్ ఫ్లై ఓవర్పై (Amberpet flyover) వీరయ్య అనే వ్యక్తి చైనా మాంజాతో గాయపడ్డాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
Chinese manja | ప్రజల సహకారం అవసరం
పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రజల సహకారం లేకపోతే చైనా మాంజా నియంత్రణ సాధ్యం కాదు. ముఖ్యంగా యువత చైనా మాంజా కొనుగోలు చేస్తున్నారు. ఇతరుల గాలిపటాలను తెంచడానికి వీటిని వినియోగిస్తున్నారు. అయితే ఇలాంటి మాంజా రోడ్లపై పడితే వారి ప్రాణాలకు కూడా ముప్పు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. చైనా మాంజాకు బదులుగా ఇతర దారాలతో పతంగులు ఎగురవేయాలని సూచిస్తున్నారు.
Chinese manja | జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుతం రోడ్లపై చైనా మాంజాలు తెగి పడిపోతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. మాంజా రోడ్డుకు అడ్డుగా ఉంటే కనిపించదు. దూరంగా పతంగులు వేలాడుతూ ఉంటే.. నెమ్మదిగా వెళ్లాలి. చిన్న పిల్లలను ముందు కూర్చొపెట్టుకోకుడదు. అలాగే మెడ చుట్టూ టవల్, మఫ్లర్ కట్టుకొని ప్రయాణాలు చేయాలి. ప్రజలు సైతం రోడ్లపై ఎక్కడైనా మాంజా కనిపిస్తే దానిని తీసి చెత్త కుప్పలో పడేయాలి. వీలైతే కాల్చివేయాలి. దీంతో ప్రమాదాలను అరికట్టిన వారు అవుతారు.