Homeతాజావార్తలుACPs transfers | పలువురు ఏసీపీల బదిలీ.. ఎవరెవరు అంటే..!

ACPs transfers | పలువురు ఏసీపీల బదిలీ.. ఎవరెవరు అంటే..!

ACPs transfers | రాష్ట్రంలో ఏసీపీలు, డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ శివధర్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACPs transfers | రాష్ట్రంలో పలువురు డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.

మల్కాజ్​గిరి ట్రాఫిక్​ ఏసీపీగా పనిచేస్తున్న శ్రీనివాస్​రావును దేవరకొండ డీఎస్పీగా నియమించారు. నిజామాబాద్​ కమిషనరేట్​ సీసీఎస్​ ఏసీపీ నాగేంద్రచారిని ఆ స్థానం నుంచి తప్పించారు.

ఆయనకు సిరిసిల్లా డీఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అలాగే, సిరిసిల్లా డీఎస్పీగా కొనసాగుతున్న చంద్రశేఖర్​రెడ్డికి ఎలాంటి పోస్టింగ్​ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయానికి అటాచ్​ చేశారు.

ACPs transfers | పలు కీలక కేసుల ఛేదనలో

ఏసీపీ నాగేంద్రచారి సీసీఎస్​లో గత కొన్నాళ్లుగా పనిచేస్తూ వచ్చారు. పలు కీలక కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించారు. నేరస్థుల గుండెళ్లో సింహస్వప్నంగా నిలిచారు. కాగా, ఆయన స్థానంలో వేరెవరికీ బాధ్యతలు కట్టబెట్టలేదు.