అక్షరటుడే, ముప్కాల్: Mupkal Mandal | బోధన్‌లో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో ముప్కాల్ ఉన్నత పాఠశాల (Mupkal High School) విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.
ఇన్నోవేటివ్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ బ్యాగ్స్ ఎగ్జిబిట్ ప్రాజెక్ట్‌కు రెండవ స్థానం లభించగా, మొబైల్ హెల్త్ క్లినిక్ – డిజాస్టర్ రిలీఫ్ ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారాం తెలిపారు. గైడ్ టీచర్లుగా మల్లేష్, నవీన్, మధు వ్యవహరించారు. విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు అభినందించారు.
