అక్షరటుడే, ఇందూరు: SathyaSai Baba centenary celebrations | సత్యసాయి బాబా శత జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారికంగా వేడుకలు నిర్వహించారు.
వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని, సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాల వేశారు. సత్యసాయి బాబా జీవిత విశేషాలు, బోధనలు, సేవా నిరతిని గుర్తు చేసుకున్నారు. వేడుకల సందర్భంగా సత్యసాయి బాబా సేవా సమితి ప్రతినిధులు భక్తి గీతాలు ఆలపించారు.
SathyaSai Baba centenary celebrations | సత్యం.. ధర్మం..
సమాజానికి సేవ చేయడం, మానవతా విలువలను పాటించడం, ప్రేమ, శాంతి, సత్య, ధర్మ, అహింసా సిద్ధాంతాలను అనుసరించడం భగవాన్ సత్యసాయి బాబా బోధించిన ముఖ్య సందేశాలు అని వక్తలు పేర్కొన్నారు.
భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు అధికారికంగా నిర్మించడం పట్ల సమితి అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ రావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, ఎన్ఐసీ అధికారి మధు తదితరులు పాల్గొన్నారు.
