Homeతాజావార్తలుPresident Draupadi Murmu | సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి : రాష్ట్రపతి...

President Draupadi Murmu | సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : President Draupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పుట్టపర్తిలో పర్యటించారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్​ (Hyderabad) పర్యటన ముగించుకొని పుట్టపర్తి చేరుకున్న ఆమెకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు.

రాష్ట్రపతి ముర్ము (President Draupadi Murmu) పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సాయి కుల్వంత్‌ హాల్​లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

సత్యసాయి విశ్వప్రేమకు ప్రతిరూపంగా జీవించారని ఆమె కొనియాడారు. లక్షల మంది ఆయన బోధనలతో మంచి మార్గంలో నడుస్తున్నారని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అన్న సాయి సందేశంతో కోట్ల మంది భక్తులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. సత్యసాయి ట్రస్టు (Sathya Sai Trust) ద్వారా అందిస్తున్న సేవలను ఆమె అభినందించారు.