అక్షరటుడే నిజామాబాద్ సిటీ: SathyaSai Baba centenary celebrations | నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశానుసారం నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం సత్య సాయి బాబా శతజయంతి వేడుకలను అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్య సాయి బాబా చిత్ర పటానికి పూలమాలలు వేసి, పూజలు చేశారు. అనంతరం అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో 1926 నవంబర్ 23న నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పెద్ద వెంకప్ప రాజు – ఈశ్వరమ్మ దంపతులకు సత్యసాయి జన్మించినట్లు తెలిపారు.
SathyaSai Baba centenary celebrations | సత్య నారాయణ వ్రతం తర్వాత..
20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారని బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాయిద్యాలు వాటంతట అవే మోగాయని చెప్పుకొంటారన్నారు.
ఇతని మహిమల పట్ల చాలా మందికి అపారమైన విశ్వాసం ఉందని, ఇది కేవలం సత్యసాయి బాబా పుట్టినరోజు వేడుక కాదని, బాబా అందించిన సనాతన ధర్మ సందేశాలను మానవతా విలువలను స్మరించుకునే ఒక పవిత్ర సందర్భం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆఫీసు సూపర్డెంట్ లు శంకర్, వనజారాణి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, సీసీ ఆర్బి ఇన్స్పెక్టర్ రమేష్, పీసీఆర్ ఇన్స్పెక్టర్ వీరయ్య, సిబ్బంది, సీఎస్బీ సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది, కంట్రోల్ రూమ్ సిబ్బంది డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.
