Homeఆంధప్రదేశ్PM Modi | ప్రేమకు ప్రతిరూపం సత్యసాయి : ప్రధాని మోదీ

PM Modi | ప్రేమకు ప్రతిరూపం సత్యసాయి : ప్రధాని మోదీ

విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని ప్రధాని మోదీ అన్నారు. బాబా శత జయంతి ఉత్సవాల్లో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనకు గవర్నర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ (Deputy CM Pawan) ఘన స్వాగతం పలికారు.

ప్రధాని మాట్లాడుతూ.. సత్యసాయి (Sathya Sai) జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని చెప్పారు. భౌతికంగా లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో ఎంతో మందికి ఆయన బోధనలు మార్గం చూపాయన్నారు. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని (PM Narendra Modi) సత్యసాయి స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు.

PM Modi | రాష్ట్ర పండుగగా ప్రకటించాం

ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ.. మనకు కనిపించిన ప్రత్యక్ష దైవం సత్యసాయి అన్నారు. ఎంతో మంది నాస్తికులను ఆయన ఆధ్యాత్మికతవైపు మళ్లించారని చెప్పారు. ఆయన సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. బాబా జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించామని తెలిపారు. ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారని గుర్తు చేసుకున్నారు. సేవ, ప్రేమకు బాబా ప్రతిరూపం అని కొనియాడారు.

ఈ వేడుకలకు మాజీ క్రికెటర్​ సచిన్​ టెండూల్కర్​ (Sachin Tendulkar), ఐశ్వర్యారాయ్​ (Aishwarya Rai​) హాజరయ్యారు. సచిన్​ మాట్లాడుతూ.. బాబా బోధనలు తనకు ఎంతో ప్రేరణను ఇచ్చాయన్నారు. ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు తన వెంట్రుకలు సత్యసాయిలా ఉన్నాయనే వారని గుర్తు చేసుకున్నారు. తన మదిలో ఎన్నో ప్రశ్నలకు బాబా దగ్గర సమాధానాలు దొరికాయని చెప్పారు. బాబా ఆశీస్సులతో జీవితంలో ఎన్నో సాధించానని తెలిపారు.