Mla Prashanth Reddy | రైతు భరోసా కేవలం ఎన్నికల స్టంట్​ మాత్రమే..

అక్షరటుడే, ఇందూరు: Mla Prashanth Reddy | రైతు భరోసా అనేది కేవలం ఎన్నికల స్టంట్​ మాత్రమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నేపథ్యంలో రైతులను మరోసారి మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతుబంధు (Rythu bandhu), రుణమాఫీ (Runa mafhi) పూర్తిస్థాయిలో […]

అక్షరటుడే, ఇందూరు: Mla Prashanth Reddy | రైతు భరోసా అనేది కేవలం ఎన్నికల స్టంట్​ మాత్రమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నేపథ్యంలో రైతులను మరోసారి మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతుబంధు (Rythu bandhu), రుణమాఫీ (Runa mafhi) పూర్తిస్థాయిలో అందించని కాంగ్రెస్​కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth reddy) రైతులపై ప్రేమ లేదని, ఓట్ల కోసం మాత్రమే నటిస్తున్నారన్నారు.

Mla Prashanth Reddy | బీజేపీ, కాంగ్రెస్​ రెండూ ఒక్కటే..

రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, దానిపై దృష్టి సారించాలని ప్రశాంత్​రెడ్డి సూచించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటేనని అందుకే బీజేపీ ఎంపీలు ఉన్నచోట మంత్రి పదవులు ఇవ్వడం లేదని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) పోలీస్ ఇన్వెస్టిగేట్ అధికారిగా మాట్లాడుతున్నారన్నారు. కేవలం కేటీఆర్​ను (KTR) జైలుకు పంపడమే లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టే కార్యక్రమాలు ఎక్కువ రోజులు సాగవన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్​ దాదన్నగారి విఠల్ రావు, నాయకులు ప్రభాకర్, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Feb 26 Gold Prices | మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం.. వెండి ధ‌ర‌ ఎంతంటే!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 26 Gold Prices | భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య అనిశ్చితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో...

Virosh Wedding Celebrations | మ‌రి కొద్ది గంట‌ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక‌ల వివాహం… ‘నో మొబైల్’ రూల్‌తో ప్రైవేట్ వెడ్డింగ్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Virosh Wedding Celebrations | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నాల వివాహం ఫిబ్రవరి 26 ఉదయం 10.10 గంటలకు ఉద‌య్‌పూర్‌లో...

Feb 26 Zodiac signs | ఆడవారితో మగవారికి.. మగవారితో ఆడవారికి వ్యాపారంలో అనుకూలం.. ఈ రాశుల వారికి తిరుగులేని లాభాలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Feb 26 Zodiac signs | గ్రహాలు, నక్షత్రాల స్తితిగతుల వల్ల ఈ రోజు (గురువారం, ఫిబ్రవరి 26) పలు horoscope...

February 26 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 26 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 26,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...