Homeజిల్లాలునిజామాబాద్​Rural Mla Bhupathi Reddy | రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మాతృవియోగం

Rural Mla Bhupathi Reddy | రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మాతృవియోగం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Rural Mla Bhupathi Reddy | నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి రేకులపల్లి లక్ష్మీనర్సమ్మ (93) సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది.

నగర శివారులోని బైపాస్​ అశోకా​ టౌన్​షిప్​లో (Ashoka Township) నివాసముంటున్న ఆమె కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మరణించారు. ఆమె అంత్యక్రియలను గూపన్​పల్లిలోని (Gupanpally) శ్మశానవాటికలో మంగళవారం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డికి పలువురు నేతలు, ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Must Read
Related News