అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth Reddy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Narendra Modi) పదవిలో నుంచి దింపడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండిన వారు పదవులను వదులుకోవాలని ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ లీగల్ కాన్క్లేవ్లో (Congress Legal Conclave) ఆయన మాట్లాడారు.
పదవి వదులుకోవాలని ఆర్ఎస్ఎస్ సూచించినా.. మోదీ అందుకు సిద్ధంగా లేరన్నారు. గతంలో అద్వానీ, మురళీమనోహర్ జోషిని 75 ఏళ్లు నిండిన వారు పదవులకు దూరంగా ఉండాలని పక్కన బెట్టారని సీఎం గుర్తుచేశారు. వారికి వర్తించిన నిబంధన మోదీకి ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. మోదీని కుర్చీ నుంచి దింపడం ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ల కాదని రేవంత్రెడ్డి అన్నారు. అది రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాత్రమే సాధ్యమన్నారు.
CM Revanth Reddy | రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి
రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా కాంగ్రెస్ పజల మధ్యే ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే పదవిలో కూర్చుంటాయని.. ఓడితే ఇంట్లో కూర్చుంటాయని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని రేవంత్రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, బీజేడీ, ఆర్జేడీ లాంటి పార్టీలు అన్ని స్వాతంత్య్రం తర్వాతే వచ్చాయన్నారు. మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.