అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rohit Sharma | మరికొన్ని రోజుల్లో టీమ్ ఇండియా(Team India) ఆసీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ టూర్‌లో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించగా, అందులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చోటు దక్కించుకున్నారు.
అయితే కెప్టెన్సీ విషయంలో కీలక మార్పు జరిగింది. ఇప్పటి వరకు వన్డేలకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం చుట్టూ క్రికెట్ వర్గాల్లో చర్చలు ఊపందుకున్న నేపథ్యంలో, తాజాగా రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ అంశంపై స్పందించాడు. సియట్ అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొన్న రోహిత్ శర్మ తొలిసారిగా ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Rohit Sharma | కెప్టెన్సీ ముఖ్యం కాదు..
నాకు కెప్టెన్సీ అంత ముఖ్యం కాదు. నా ఫోకస్ క్రికెట్ ఆడటంపైనే ఉంది. ఇప్పటికీ నేను భారత జట్టులో ఉండడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడటమే నా లక్ష్యం. జట్టులో ఓ సీనియర్ ఆటగాడిగా, మంచి ఫలితాలు అందించేందుకు నా వంతు కృషి చేస్తాను,” అని రోహిత్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా(Australia)తో వన్డే సిరీస్‌పై కూడా ఆయన స్పందిస్తూ, “ఆస్ట్రేలియా జట్టుతో తలపడటమంటే సవాళ్లతో పాటు కష్టం కూడా ఉంటుంది. ఆ దేశం క్రికెట్‌ను ఎంతో ప్రేమగా చూస్తుంది. అటువంటి వేదికపై భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఇప్పటినుంచే ప్రణాళికలు వేసుకుంటున్నాను,” అని చెప్పాడు.
రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ – “మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉంటే ప్రణాళికలు వేయడం కష్టంగా మారుతుంది. సెలక్టర్లు, కోచ్‌కి కూడా ఇది ఓ సవాల్. అందుకే అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ ఇవ్వడం 2027 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకునే జరిగింది. ఇప్పటి నుంచే అతనికి అనుభవం కల్పిస్తే, వచ్చే ప్రపంచకప్‌కి టీమ్‌ను బలంగా నడిపించగలడు,” అని వివరించారు. అయితే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుండి తప్పించిన కూడా ఆయన ఎలాంటి కామెంట్స్ చేయకుండా పరిక్వతతో మాట్లాడి అందరి మనసులు గెలుచుకున్నాడు.