అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Komatireddy | రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దశలవారీగా హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.
హ్యామ్ రోడ్ల నిర్మాణంపై మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తో కలిసి సచివాలయంలో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో రూ.10,986 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. వచ్చె నెలలో వీటికి టెండర్లు పిలుస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల హ్యామ్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్(Hyderabad) నగరానికి నాలుగు వరుసల రోడ్లు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు.
Minister Komatireddy | దేశానికే రోల్ మోడల్
తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా నిలపాలనే లక్ష్యంతో ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో 5,587 కి.మీ. మేర హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రోడ్ల విషయంలో అన్ని నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్అండ్బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.