అక్షరటుడే, కమ్మర్పల్లి: road accident | ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పరిధిలో చోటుచేసుకుంది.
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కమ్మర్పల్లి వైపు నుంచి కోరుట్ల వైపు టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది.
road accident | ఎమ్మెల్యే సాయం..
ఆ సమయంలో నిజామాబాద్ వైపు నుంచి వస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రమాద స్థలం వద్ద ఆగారు. 108 కు సమాచారం అందించారు. క్షతగాత్రులకు తీవ్ర రక్త స్రావం కావడంతో తన కారులో ఉన్న వస్త్రాలను తీసి క్షతగాత్రులపై కప్పారు. అనంతరం అంబులెన్స్‌లో మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
